వంగవీటి మోహన రంగ 78వ జయంతి వేడుకలలో పాల్గొన్న : ప్రేమ కుమార్
ప్రశ్న ఆయుధం జులై04: కూకట్‌పల్లి ప్రతినిధి
కెపిహెచ్బి కాలనీ 3వ ఫేస్ కూకట్‌పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన వంగవీటి మోహన రంగ 78వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇంచార్జ్ కూకట్‌పల్లి నియోజకవర్గం ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి , కమిటీ సభ్యులు మరియు రంగా అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి కాపు వెల్ఫేర్ సభ్యులు ,జనసేన పార్టీ నాయకులు , వివిధ పార్టీ నాయకులు మరియు వంగవీటి మోహన రంగా అభిమానులు పాల్గొన్నారు.