గ్రామ పంచాయితీ ఎన్నికలకు సిద్ధం –
బ్యాలెట్ బాక్సుల వినియోగం, భద్రతపై జిల్లా కలెక్టర్ సమీక్ష
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా డిసెంబర్ 01
కామారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్‌ల వినియోగం, సంసిద్ధత, భద్రత అంశాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డితో కలిసి నోడల్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో, రాబోయే పంచాయితీ ఎన్నికల్లో ఉపయోగించనున్న బ్యాలెట్ బాక్స్‌ల పంపిణీ, నిల్వ, రవాణా, సీలింగ్ వంటి సున్నితమైన అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. నోడల్ అధికారులకు కేటాయించిన బాధ్యతలను పారదర్శకంగా, పొరపాట్లు లేకుండా నిర్వర్తించాలని పరిశీలకులు సూచించారు.
రేపటితో రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటి వరకు చేపట్టిన చర్యలు, పోలింగ్ వరకు అమలు చేయాల్సిన ఏర్పాట్లు గురించి నోడల్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
🔸 బ్యాలెట్ పేపర్లు – మెటీరియల్ మేనేజ్మెంట్
బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, జోనల్ అధికారుల నియామకం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, సోషల్ మీడియా మానిటరింగ్, అభ్యర్థుల ఖర్చుల పరిశీలన వంటి అంశాలు సమావేశంలో ప్రధానాంశాలుగా నిలిచాయి. అభ్యర్థులు ఖరారైన తరువాత ఖర్చుల వివరాలు పర్యవేక్షించాలని ఎక్స్పెండిచర్ నోడల్ అధికారులకు సూచించారు.
🔸 బ్యాలెట్ బాక్స్‌ల సంఖ్య – నాణ్యత తనిఖీ
ప్రతి మండలానికి అవసరమైన బాక్సుల జాబితా ఖరారు
పాడైపోయిన, వినియోగయోగ్యం కాని బాక్సులు మార్చివేత
లాక్‌లు, స్లాట్లు, సీల్ పాయింట్ల తనిఖీ తప్పనిసరి
🔸 భద్రత & నిల్వ వ్యవస్థ
డిపాజిట్ కేంద్రాల్లో 24×7 భద్రత
సీసీ కెమెరాలు, పోలీసు పహారా తప్పనిసరి
అనధికార ప్రవేశం అస్సలు ఉండకూడదని ఆదేశాలు
🔸 రవాణా ప్రణాళిక
పోలింగ్ రోజు సురక్షిత రవాణా కోసం ప్రత్యేక ప్రణాళిక
రవాణా వాహనాలకు GPS అమరిక
అవసరమైతే సీల్డ్ వాహనాల వినియోగం పరిశీలన
🔸 పోలింగ్ అనంతరం బాక్సుల స్వీకరణ
ప్రీసైడింగ్ ఆఫీసర్ల నుండి బాక్సుల స్వీకరణ కౌంటర్లు సిద్ధం
పార్టీ ఏజెంట్ల సమక్షంలో సీలు వేసే విధానం అమలు
🔸 శిక్షణ – సిబ్బంది అవగాహన
POలు, APOలు, పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్ హ్యాండ్లింగ్, సీలింగ్, ప్యాకింగ్ విధానంలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఏ చిన్న తప్పిదం కూడా ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపుతుందన్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సీఈఓ చందర్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు .