Site icon PRASHNA AYUDHAM

ప్రజా పోరాటాలకు సన్నద్ధమై స్వచ్ఛ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

IMG 20250719 WA0046

*ప్రజా పోరాటాలకు సన్నద్ధమై స్వచ్ఛ రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి*

*సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి*

*జమ్మికుంట జులై 19 ప్రశ్న ఆయుధం*

గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.శనివారం రోజున సిపిఎం పార్టీ జమ్మికుంట, ఇల్లందకుంట, హుజురాబాద్ కార్యకర్తల సమావేశం జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు ఈ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, దేశంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం, రైతు,కార్మిక, వ్యవసాయ కూలీలు పేద మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపుతూ పరోక్ష దోపిడిని కొనసాగిస్తుందని, కొద్ది మంది పెట్టుబడిదారుల కోసం వారి ఆస్తులు పోగుపడేందుకు తన విధానాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఒకపక్క దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి, ఉపాధి,ఉద్యోగ అవకాశాలు తగ్గాయని, దేశంలో బిజెపి ఏలుబడిలో కొత్తగా పరిశ్రమలు సృష్టించక పొగా, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ కారు చౌకగా గుత్తా పెట్టుబడుదారులకు బడా పారిశ్రామిక వ్యక్తులకు దోచిపెడుతుందని పేర్కొన్నారు పక్క దేశాలతో యుద్ధం పేరుతో ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తూ ప్రశ్నించే వ్యక్తులను సంఘాలను అణిచివేస్తుందని ఆరోపించారు.

మతపరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ, దేశంలో వివిధ రాష్ట్రాలలో జాతుల మధ్య తెగల మధ్య విద్వేషాలు సృష్టించి తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటుందని, మతం వ్యక్తిగత విశ్వాసం అయినప్పటికీ, దానిని రాజకీయాలకు పులిమి బిజెపి లబ్ధి పొందుతుందని, ఒకపక్క దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతుంటే, మతమౌడ్యం సృష్టించి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతాంగ పోరాటంతో దిగివచ్చిన మోడీ ప్రభుత్వం, మళ్లీ ఇప్పుడు స్వాతంత్రానికి పూర్వం కొన్ని సాధించుకున్న కార్మిక చట్టాలు కొన్ని, స్వాతంత్రం వచ్చాక కార్మికుల పోరాటాలతో సాధించుకున్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకొస్తూ, పని గంటలు పెంచుతూ ఉద్యోగ భద్రత లేకుండా చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వారి లాభార్జన ద్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని, కొన్నింటిని మాత్రమే అమలు చేసి, ఇంకా మహిళలకి 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం, పూర్తిస్థాయిలో రుణమాఫీ, 4000 రూపాయల పెన్షన్, నిరుద్యోగ భృతి లాంటి హామీలను అమలు చేయకపోతే ప్రజా వ్యతిరేకతను మూటకటుకుంటుందని అలాగే పైకి చూడ కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తున్నట్టు ప్రచారం చేస్తూ, మోడీ ప్రభుత్వ విధానాలను వంత పాడినట్టు రాష్ట్రంలో కూడా అమలు చేస్తుందని తెలిపారు.

అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఎం పార్టీ తాను సొంతంగా బలమున్న స్థానాలలో పోటీ చేస్తుందని తెలిపారు. అలాగే ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్, కొప్పుల శంకర్ ఇల్లందకుంట మండల కార్యదర్శి చెల్పూరి రాములు, సైదాపూర్ మండల కార్యదర్శి గుండేటి వాసుదేవ్, మండల నాయకులు జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్, వడ్లూరి కిషోర్, శ్రీకాంత్, కన్నం సదానందం, కొత్తూరు మల్లయ్య, మల్లేష్, అశోక్, రాచపల్లి ఐలయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version