జిల్లాస్థాయి క్రీడా ఉత్సవాలకు రంగం సిద్ధం
జిల్లా కన్వీనర్లతో ఎస్‌జిఎఫ్ కీలక నిర్ణయాలు
భూపాలపల్లి కలెక్టరేట్‌లో ఎస్‌జిఎఫ్ సమావేశం ఘనంగా
సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
అండర్-14, అండర్-17 బాలబాలికలకు వేర్వేరు క్రీడలలో పోటీలు
జోనల్ లెవెల్ టోర్నమెంట్లు 15 నుంచి 19 వరకూ
డివైఎస్‌ఓ రఘు, జనరల్ సెక్రటరీ లావుడియా జైపాల్ ఆధ్వర్యం
భూపాలపల్లి, ఆగస్టు 28 (ప్రశ్న ఆయుధం):
జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్‌లోని స్థానిక డివైఎస్‌ఓ కార్యాలయంలో జిల్లా స్పోర్ట్స్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జిఎఫ్) మండల కన్వీనర్ల సమావేశం జరిగింది. ఎస్‌జిఎఫ్ జనరల్ సెక్రటరీ లావుడియా జైపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని 12 మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు.
సమావేశంలో అండర్-14, అండర్-17 వయసు వర్గాల బాలబాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ వంటి క్రీడలలో ఎంపిక పోటీలు సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత జోనల్ లెవెల్ టోర్నమెంట్లు కమ్ సెలక్షన్లు సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు జరగనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డివైఎస్‌ఓ సిహెచ్. రఘు మాట్లాడుతూ క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జోనల్ కన్వీనర్లు ఎస్. రమేష్, టీ. రాజయ్య, జి. విజయ, రాజయ్య, విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. మండల కన్వీనర్లలో ప్రతాప్, సరిత, సాంబమూర్తి, శ్రీకోటి, పృథ్వీరాజ్, జ్యోతి, యోగానంద స్వామి, అన్వర్ పాషా, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.