కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని భారీ కాగడాల ప్రదర్శన
భారత సైనికుల వీరోచిత పోరాట పరాక్రమానికి ప్రతీక కార్గిల్ వార్
పాకిస్తాన్ కు భారత ఆర్మీ శక్తి రుచి చూపిన కార్గిల్
కార్గిల్ సైనికుల పోరాట స్ఫూర్తి నేటికీ చిరస్మరణీయం
బిజెపి బీజేవైఎం నేతలు గంగాడి కృష్ణారెడ్డి ఓరుగంటి చంద్రశేఖర్ దురుశెట్టి సంపత్
కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో జులై 25
కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని భారతీయ జనతా యువ మోర్చా జిల్లా అధ్యక్షులు దురుశెట్టి సంపత్ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కరీంనగర్ కోర్టు చౌరస్తా నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్ జిల్లా అధ్యక్షుడు దుర్శేటి సంపత్ లు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన అమర జవానులకు కరీంనగర్ బిజెపి బిజెవైఎం పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. దేశ సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ తమ ప్రాణాలను పణంగా పెట్టి శత్రుల కుట్రలను తిప్పికొడుతూ దేశ ప్రజలకు రక్షణగా నిలుస్తున్న సైనికుల సేవలు
అసామాన్యమని వెలకట్టలేనివన్నారు. ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ కు ఉమ్మడి రాజధాని అయిన కార్గిల్ ద్వారా 1999లో పాకిస్తాన్ సైనికులు భారత భూభాగంలో అడుగుపెట్టారని దొడ్డి దారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన పాక్ సైనికులకు భారత ఆర్మీ తమ పరాక్రమాన్ని రుచి చూపించిందని ఆపరేషన్ విజయ్ తో కార్గిల్ నుండి పాకిస్తాన్ చొరబాటు దారులపై భారత్ ఆర్మీ యుద్ధభేరి మోగించి దయాది సైనికుల పై విరుచుకపడి తరిమి కొట్టిందని భారత సైనికుల వీరోచిత పోరాట పరాక్రమానికి ప్రత్యేకగా కార్గిల్ వార్ నిలుస్తుందని కార్గిల్ సైనికుల పోరాట స్ఫూర్తి నేటికి చిరస్మరణీయమన్నారు. ఆనాటి కార్గిల్ యుద్ధం జులై 26న ముగిసిందని అందుకే కార్గిల్ విజయ్ దినోత్సవం ను ప్రతి ఏటా జూలై 26న భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాడ వెంకటరెడ్డి యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి యువ క్రాంతి కటకం లోకేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవల్లి శశిధర్ రెడ్డి శ్రీరాముల శ్రీకాంత్ ఉపాధ్యక్షులు గుండారం సంపత్ ఈసపెల్లి మహేష్ సోషల్ మీడియా పార్లమెంటు కన్వీనర్ ఉప్పరపల్లి శ్రీనివాస్ దేవరకొండ అజయ్ మహేష్ తిప్పర్తి నికేష్ శివారెడ్డ కార్యదర్శులు అనిల్ బొడ్డు అశోక్ పొన్నల రాము మహేష్ మాచర్ల శశి అరవింద్ ప్రవీణ్ శ్రీకాంత్ నాయక్ సాయినాథ్ చందు రమన్ భరత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు