తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం)
– కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా, వినతిపత్రం అందజేత
కామారెడ్డి
పై హామీల్లో ప్రింటెడ్ రిజిష్టర్స్ ఇచ్చారు. స్పూటం డబ్బాలు మోయటం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర సమస్యలు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నేటి వరకు ఈ సంవత్సర కాలంలో మంత్రులకు, ఎంఎల్ఎలకు, ఉన్నతాధికారులకు ఆశాలు అనేక విజ్ఞప్తులు చేశారు. నిరంతరం ఆందోళనా – పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నామన్నారు. కావున పై అంశాలను పరిశీలించి, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని, ఈ క్రింది డిమాండ్స్న పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. డిమాండ్స్ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000 లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలి.12 ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు, ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. వెయిటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలి. గత 15 రోజుల సమ్మె హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు, ఫిబ్రవరి 9న జూలై 30న డిసెంబర్ 10న ఆరోగ్య శాఖ కమీషనర్ గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్ఫూరెన్స్ రూ.50 లక్షలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు మట్టి ఖర్చులు రూ.50 వేలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం మరియు పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. డిసెంబర్ 10న ఇచ్చిన హామీ ప్రకారం ఏఎన్సీ, పిఎన్సి తదితర టార్గెట్స్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలి.
ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలి. 6 నెలలు మెడికల్ సెలవులు ఇవ్వాలి. గత ప్రభుత్వ హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి. ఆశాలకు పూనమ్ క్లాత్తోతో కూడిన క్వాలిటీ యూనిఫామ్ మరియు ఎండాకాలంలో కాటన్ యూనిఫామ్ ఇవ్వాలి. ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. 2021 జూలై నుండి డిశెంబర్ వరకు 6 నెలల పిఆర్సి ఎరియర్స్ వెంటనే చెల్లించాలి.2022, 2023, 2024 సం॥ల లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలి. 2024 మార్చి 3-5 వరకు 3 రోజుల పల్స్ పోలియో డబ్బులు చెల్లించాలి. ఇప్పటివరకు లేని ఆసుపత్రుల్లో వెంటనే ఆశాలకు రెస్ట్రూం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కేటాయించిన ప్రాంతాల్లో ఇతరులకు ప్రవేశం ఉండకూడదని ఆదేశాలు జారీ చేయాలి. ఆశాలకు పని భారం తగ్గించాలి. పారితోషికం లేని పనులు చేయించకూడదు మై న్యాయమైన నియమాలను పరిష్కరించాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు ఇందిర, కార్యదర్శి రాజశ్రీ, పిహెచ్సి అధ్యక్ష కార్యదర్శులు మమత, ప్రమీల, పద్మ, లావణ్య, రాజమణి, మణెమ్మ, భాగ్యలక్ష్మి, లావణ్య, పద్మ, జిల్లాలోని ఆశాలు తదితరులు పాల్గొన్నారు.