సంగారెడ్డి, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని తారా కాలేజీ వద్ద గల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సెప్టిక్ ట్యాంక్ డ్రైనేజీ నీరు లీకై సమీపంలోని డ్రైవర్స్ కాలనీ, సరస్వతి నగర్ కాలనీ రోడ్లపై ప్రవహిస్తోందని, దీంతో రోడ్లు గుంతలుగా మారి వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, డ్రైనేజీ నీటి మురుగు వల్ల దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమస్యను పరిశీలించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా హాస్టల్ డ్రైనేజీ లీకేజీపై స్థానికులు పలుమార్లు హాస్టల్ వార్డెన్‌కు తెలిపినా, ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి తారా కాలేజీ హాస్టల్ డ్రైనేజీ నీటి లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తారా కాలేజీ హాస్టల్ డ్రైనేజీ నీటి లీకేజీ సమస్యను పరిష్కరించాలి: ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర
Published On: November 2, 2025 7:28 pm