Site icon PRASHNA AYUDHAM

రాజ్య సభకు నలుగురిని నామినేట్ చేసిన నామినేట్ రాష్ట్రపతి..

IMG 20250713 WA2223

*రాజ్య సభకు నలుగురిని నామినేట్ చేసిన నామినేట్ రాష్ట్రపతి..*

*ప్రధాని మోడీ ఆసక్తికరమైన ట్వీట్*

భారత రాష్ట్ర ద్రౌపది ముర్ము.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a), 80(3) ప్రకారం తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేశారు.

ఉజ్జ్వల్ దేవరావ్ నికం, సి. సదానందన్ మాస్టర్, హర్షవర్ధన్ శృంగ్లా, డాక్టర్ మీనాక్షి జైన్‌లకు చోటు దక్కింది. ఈ నలుగురు భారత దేశంలో వివిధ రంగాల్లో రాణించిన వారే కావడం విశేషం. అయితే రాష్ట్ర పతి ముర్ము నిర్ణయంతో రాజ్యసభకు నలుగురు నామినెట్ కావడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్లు చేశారు.

అందులో మొదట ఉజ్వల్ నికం గురించి ఇలా ట్వీట్ చేశారు.. న్యాయ రంగం పట్ల.. మన రాజ్యాంగం పట్ల ఉజ్వల్ నికంకు ఉన్న అంకితభావం ఆదర్శప్రాయమైనది. ఆయన విజయవంతమైన న్యాయవాది మాత్రమే కాదు.. ముఖ్యమైన కేసుల్లో న్యాయం కోరడంలో కూడా ముందంజలో ఉన్నారు. తన న్యాయవాద వృత్తి జీవితంలో, రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి, సాధారణ పౌరులను ఎల్లప్పుడూ గౌరవంగా చూసుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ కృషి చేశారు. భారత రాష్ట్రపతి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన పార్లమెంటరీ ఇన్నింగ్స్‌కు నా శుభాకాంక్షలు.

మరో ట్వీట్ లో సి. సదానందన్ మాస్టర్ గురించి ఇలా రాసుకొచ్చారు. ” సి. సదానందన్ మాస్టర్ జీవితం అన్యాయానికి తలొగ్గడానికి నిరాకరించే ధైర్యం యొక్క ప్రతిరూపం. హింస, బెదిరింపులు దేశాభివృద్ధి పట్ల ఆయన స్ఫూర్తిని అడ్డుకోలేక పోయాయి. ఉపాధ్యాయుడిగా, సామాజిక కార్యకర్తగా ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ప్రశంసనీయం. యువత సాధికారత పట్ల ఆయనకు అత్యంత మక్కువ ఉంది. రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినందుకు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

ప్రధాని హర్ష్ వర్ధన్ శ్రింగ్లా గురించి స్పందిస్తూ.. “హర్ష్ వర్ధన్ శ్రింగ్లా దౌత్యవేత్తగా, మేధావిగా.. వ్యూహాత్మక ఆలోచనాపరుడిగా రాణించారు. సంవత్సరాలుగా, ఆయన భారతదేశ విదేశాంగ విధానానికి కీలక సహకారాలు అందించారు. మన G20 అధ్యక్ష పదవికి కూడా దోహదపడ్డారు. భారత రాష్ట్రపతి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉంది. ఆయన ప్రత్యేక దృక్పథాలు పార్లమెంటరీ కార్యకలాపాలను బాగా మెరుగుపరుస్తాయి.

అలాగే డాక్టర్ మీనాక్షి జైన్ గురించి ప్రధాని మోడీ ఇలా రాసుకొచ్చారు. “డాక్టర్ మీనాక్షి జైన్‌ ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆమె పండితురాలు, పరిశోధకురాలు, చరిత్రకారిణిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజకీయ శాస్త్ర రంగాల్లో ఆమె చేసిన కృషి విద్యా రంగాన్ని గణనీయంగా సుసంపన్నం చేసింది. ఆమె పార్లమెంటరీ పదవీకాలానికి శుభాకాంక్షలు.” అని రాసుకొచ్చారు.

Exit mobile version