ప్రభుత్వ సలహాదారుకు కృతజ్ఞతలు తెలిపిన వివిధ మండలాల అధ్యక్షులు
– కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఐదు కోట్ల నిధులు మంజూరు
-ప్రశ్న ఆయుధం కామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించేందుకు గాను ఐదు కోట్ల నిధులను మంజూరు చేసినందుకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కు వివిధ మండలాల అధ్యక్షులు కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి నియోజక వర్గంలోని వివిధ గ్రామాల అభివృద్ధి కొరకు ఎస్సీ సబ్ ప్లాన్ గ్రాంట్స్ లో సిసి రోడ్స్, డ్రెయిన్స్ నిర్మాణానికి ఐదు కోట్ల రూపాయలు చేయించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ కి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని కామారెడ్డి డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు అన్నారు.