సీనియర్ సిటిజన్స్ కు ఆటల పోటీలు ప్రారంభించిన అధ్యక్షులు 

సీనియర్ సిటిజన్స్ కు ఆటల పోటీలు ప్రారంభించిన అధ్యక్షులు

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 11

 

విద్యానగర్ కాలనీలో గల కామారెడ్డి సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ కు ఆటల పోటీలను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి ఆటలు, పాటలు ప్రతి మనిషికి ముఖ్యమని తెలియజేశారు. క్యారం డబుల్స్ సింగిల్స్ , షటిల్స్ డబుల్ సింగిల్స్, రమ్మీ కబ్, చెస్ , యోగ అవుట్డోర్ ఇండోర్, వాకింగ్, పాటలు పోటీలు ఆడించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజన్న, కోశాధికారి జైహింద్ గౌడ్, సంయుక్త కార్యదర్శి ఎం మోహన్ రెడ్డి, ప్రచార కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, ఆటలాడే సీనియర్ సిటిజన్స్ హాజరైనారు.

ఆటల పాటల పోటీల్లో గెలుపొందిన వారికి స్వాతంత్ర దినోత్సవం నా బహుమతులను ప్రధానం చేయబడుతుందన్నారు.

Join WhatsApp

Join Now