నాగారంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభం

*నాగారంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యాలయం ప్రారంభం*

మేడ్చల్ జిల్లా నాగారం కృష్ణ ఆయుధం మే 22

ప్రెస్ క్లబ్ ఆఫ్ నాగారం మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాడు అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్ప రామారావు, నాగారానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అనంతరం, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శివకుమార్ అతిథులను శాలువాలతో సన్మానించి క్లబ్ షీల్డులను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ రజినీకాంత్, వైస్ ప్రెసిడెంట్లు సంతోష్, నరేష్, జాయింట్ సెక్రటరీలు బసవ రెడ్డి, దినేష్ కుమార్, ట్రెజరర్లు గురుమూర్తి, బాలకిషన్, సలహాదారులు కరుణాకర్ గౌడ్, నరసింహ, చిత్తారి రాజు, సతీష్ కుమార్, సాయికరణ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now