కందర్పల్లి వాసి గంగాధర్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు

కందర్పల్లి వాసి గంగాధర్ కు ప్రతిష్ఠాత్మక అవార్డు

ప్రశ్న ఆయుధం 29 డిసెంబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

కామారెడ్డి జిల్లా మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు నర్సింలు కుమారుడు ప్రముఖ శిక్షకుడు మోటివేషనల్ స్పీకర్ కె. గంగాధర్ హైటెక్ సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రతిష్ఠాత్మకమైన “బిజినెస్ ఎమినెన్స్ అవార్డు” ను అందుకున్నారు. వ్యాపార రంగంలో శిక్షణ ద్వారా యువతలో ఆత్మవిశ్వాసాన్ని నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సేవలకు గాను ఈ అవార్డును ప్రదానం చేసినట్లు IRIE సంస్థ తెలిపింది.ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ కష్టపడితే విజయం బానిసవుతుందని ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండాలని ఆయన తెలిపారు.యువత అనుకుంటే చేయలేనేది ఏమి ఉండదని ఆయన గుర్తు చేశారు.కష్టపడి తల్లిదండ్రులకు సమాజం లో మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

Join WhatsApp

Join Now