విషజ్వరాలను అరికట్టాలి
ప్రభుత్వ హాస్పటల్లో అన్ని రకాల జబ్బులకు వైద్యం అందించాలి
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ
ప్రశ్న ఆయుధం
యాదాద్రి భువనగిరి /
రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతున్న విషజ్వరాలను అరికట్టి అన్ని ప్రభుత్వ హాస్పటల్లో అన్నిరకాల జబ్బులకు వైద్యం అందించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. జిల్లాలో అనేక మారుమూల గ్రామాలలో కూడా డెంగ్యూ, మలేరి , టైపాడ్, చికెన్ గున్యా లాంటి విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వ దవఖానలో జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలు పరీక్ష చేయించుకోవడం కోసం పోతే అన్ని టెస్టులు చేయకపోవడంతో డెంగ్యూ టెస్టు చేయడానికి కిట్లు లేకపోవడంతో వేలాది రూపాలు ప్రవేటు ల్యాబ్ లలో పెట్టి టెస్టులు చేయించుకోలేక, డెంగ్యూ జ్వరం వస్తే వైద్యము ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇవ్వకపోవడంతో లక్షలాది రూపాయలు పెట్టి ప్రైవేటు హాస్పిటల్స్ లో వైద్యం చేసుకోలేక అనేకమంది పేదలు, వ్యవసాయ కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ హాస్పటల్లో అన్నిరకాల టెస్టులు చేసి వైద్యం అందించాలని నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నూతనంగా ఏర్పడిన
కాంగ్రెస్ ప్రభుత్వం విషజ్వరాలతో బాధపడుతున్న ప్రజల్ని పట్టించువాలనీ వెంటనే మారుమూల గ్రామాలలో కూడా హెల్త్ క్యాంపులు ఎమర్జెన్సీగా పెట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో హాస్పిటల్లో అన్నిరకాల డాక్టర్లు నియమించాలని, వస్తున్న జబ్బులకు అనుగుణంగా వైద్యం అందించి సంబంధించిన మందులు కూడా ఇవ్వాలని అన్నారు. లేనిచో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.