మానసిక ఒత్తిడి నివారణ

*విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి నివారణ అంశంపై అవగాహన సదస్సు*
*సైకాలజిస్ట్ రమణారెడ్డి*

*జమ్మికుంట/ వీణవంక ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 5*

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు జిల్లా మానసిక ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న సైకాలజిస్ట్ రమణారెడ్డి మానసిక ఒత్తిడి నివారణ అంశంపై సోమవారం రోజున అవగాహన కల్పించారు సైకాలజిస్ట్ రమణారెడ్డి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి వలన కలిగే నష్టాలు వాటి నివారణ గురించి విద్యార్థులకు కులకుశంగా వివరించారు సిగరేటు పొగాకు ఉత్పత్తులు వినియోగించడం వల్ల నోటి క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని వాటి ద్వారా మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని ప్రతి విద్యార్థి ప్రతిరోజు యోగా వ్యాయామం చేయాలని సూచించారు ఏదైనా మానసిక రుగ్మతతో బాధపడేవారు జిల్లా ఆరోగ్య కేంద్రంలోని 117 రూము యందు సైకియాట్రిస్ట్ సైకాలజిస్టులు అందుబాటులో ఉంటారని తెలిపారు కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా విద్య అభ్యసించాలని రాబోయే పరీక్షల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో లైబ్రరీ రియల్ రామ్మోహన్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now