రైతు వేదికలో నివారణ సూచనలు
పంటల్లో తెగుళ్లు – అధికారి ల సూచనలు
ప్రశ్న ఆయుధం ఇస్రోజివాడ, ఆగస్టు 5:
ఇస్రోజివాడ గ్రామ రైతు వేదికలో జరిగిన “రైతు నేస్తం” కార్యక్రమంలో ఏవో పవన్ కుమార్, AEOలు దేవేంద్ర, ప్రతిమ పాల్గొన్నారు.
వరి, మొక్కజొన్న, ప్రత్తి పంటలను అధికారులు పరిశీలించారు.
వరిలో ఉల్లి కోడు (గాలి పురుగు) ఆశించడం గమనించారు. నివారణకు ఎకరాకు 4 కిలోల ఫిప్రోనిల్ గుళికలు, 20 కిలోల ఇసుకలో కలిపి బురద పదునులో చల్లాలని సూచించారు.
మొక్కజొన్నలో కత్తెర పురుగు తీవ్రతగా ఉంది. నివారణకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజాయేట్ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.
ప్రత్తిలో కాండం కుళ్ళు తెగులు ముప్పు ఉందని, నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కార్బన్డిజం + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుదర్శన్ రావు, మండల వ్యవసాయ అధికారి పవన్, రైతులు పాల్గొన్నారు.