సామాన్యులకు దడ పుట్టించునున్న ధరలు..
రాష్ట్రంలో పండగ ముందు నిత్యవసర ధరలు ఆకా శానికి అంటనున్నాయి . రోజు రోజుకు నూనెలు, బియ్యం,కూరగాయల, ధరలు రోజురోజుకు పోటీ పడుతున్నాయి.తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ పది రోజుల్లోనే మొదలుకానుంది ఈ పండుగ సమయంలో ధరల పెరుగుదల మధ్యత రగతి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.రోజు రోజుకు నిత్యవసర, అత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతుంటే ఏం చేయాలనో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. దసరా, దీపావళి వంటి పండగలు వస్తే.. ఇళ్లకు చట్టాలు వస్తారు. ఈ పండగల వేళ కాస్త ఎక్కువ గా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.పిండివంటలు, అందరు కలిసి భోజనాలు చేస్తుం టారు. కానీ సామాన్యుల ఆనందాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిరి చేస్తు న్నాయి. పెరిగిపోతున్న ధరలను అదుపు చేయడం లేదు. పైగా మరింత ధరలు పెంచుతూ సామాన్యులకు వెన్నుపోటు పొడుస్తు న్నాయి. ఈ మధ్యే నూనెల ధరలు భారీగా పెరిగాయి. సరిగ్గా పండగల సమయం చూసి కేంద్రం సామాన్యులకు షాకిచ్చింది. అప్పటికే ఉల్లిధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు ఏ వస్తువులు తక్కువ ధరకు ఉన్నాయా అని వెతుక్కొ వల్సిన పరిస్థితి ఎదురైంది. సామాన్య, పేద ప్రజలు పండగ చేసుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. చేతిలో డబ్బు ఉన్నప్పుడే పండగ ఆనందం. పామా యిల్, సన్ ఫ్లవర్ ధరలు లీటర్ 20 రూపాయలకు పైగా పెరిగిపోయాయి. వేరుశనగ కూడా ఏకంగా 160 రూపాయలు దాటింది. రైస్ బ్రాన్ ఆయిల్ రూ. 120కి చేరుకుంది.