నేడు మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో పర్యటించనున్న ప్రధాని మోదీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, రాజస్తాన్‌లలో పర్యటించనున్నారు. మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగే కార్యక్రమంలో 11 లక్షల నూతన ‘లఖ్‌పతి దీదీస్’ను ఆయన సన్మానిస్తారు. ఇదే కార్యక్రమంలో 4.3 లక్షల స్వయం సహాయక బృందాలకు రివాల్వింగ్ ఫండ్ కింద రూ.2,500 కోట్లను విడుదల చేస్తారు. మరో రూ.5 వేల కోట్ల రుణాలను పంపిణీ చేస్తారు. అనంతరం, ఆయన రాజస్తాన్‌లోని జోథ్‌పూర్ వెళ్తారు.