*చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ*
న్యూఢిల్లీ: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “నా మంచి స్నేహితుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తీరు ప్రశంసనీయం. ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభిస్తారు. మూడు ఏళ్లలో అసెంబ్లీ, హైకోర్ట్, సచివాలయం, అమరావతి పనులు మొత్తం పూర్తయి తీరాల్సిందేనని, అందుకు సంబంధించిన పనులకు టెండర్లు పిలిచామని సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని మోదీ శంకుస్థాపన అనంతరం రాజధాని అమరావతి పనులు ఊపందుకొన్నున్నాయి. మరోవైపు ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు జరుగుతోన్నాయి..