ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..

*Pahalgam Terror Attack: హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..*

కీలక నిర్ణయం తీసుకునే అవకాశం..

ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఎయిర్‌పోర్టులోనే.. పహల్‌గామ్‌ లో ఉగ్రదాడి ఘటనపై NSA అజిల్‌ దోవల్‌ వివరణ ఇచ్చారు.

దోవల్‌తోపాటు విదేశాంగమంత్రి, విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు..

కాసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం కానుంది. CCS సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..

ఉగ్రదాడితో.. జమ్మూ కశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. అణువణువూ గాలిస్తున్నారు. నింగి, నేల ఏదీ వదలడం లేదు. కొండలు, గుట్టలు, అనుమానాస్పద ప్రాంతాల్లో.. క్షణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌, వాయుసేన బలగాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. ఉగ్రదాడి ఘటనపై NIA కూడా రంగంలోకి దిగింది. ఇవాళ NIA బృందాలు ఘటనాస్థలానికి చేరుకోనున్నాయి..

మరోవైపు.. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బిహార్ పాట్నాలో పాక్ ఫ్లాగ్, పాకిస్తాన్ ప్రధాని ప్లకార్డులను దగ్దం చేశారు.

ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తుందంటూ నినాదాలు చేశారు. పాక్‌కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now