చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం

*చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం*

*జమ్మికుంట మే 2 ప్రశ్న ఆయుధం*

IMG 20250502 WA2573 మొట్టమొదటిసారిగా కుల గణనకు చేయడం హర్షించదగ్గ విషయమని కుల గణనకు ఆదేశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలగాని రాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు హాజరైన ఎర్రబెల్లి సంపత్ రావు కొలకాని రాజు, జీడి మల్లేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన అంటే జనాభా లెక్కల సమయంలో ప్రజల కులాల వారిగా సమాచారాన్ని సేకరించడం అని, దేశంలోని వివిధ కులాల సమూహాల పంపిణీ, సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని, నేటికీ మన దేశంలో అక్కడక్కడా కుల వివక్ష ఉందని దానిని రూపుమాపేందుకు ఈ కులగణన ప్రజల్లో అవగాహన కల్పించి దోహదపడుతుందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సరిగా లేదని, తప్పుల తడక ఉందని ఎద్దేవా చేశారు ఈకార్యక్రమంలో నాయకులు మోతె స్వామి, ఇటుకాల స్వరూప, కేశ స్వరూప, గంగాభవాని, కైలాసకొటి గణేష్, యగ్గని చందు, రాజేష్ ఠాకూర్, రాకేష్ ఠాకూర్, మోడం రాజు, ముకుందా సుధాకర్, అప్పాల రవిందర్, కురిమిల్ల అశోక్, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి అఖిల్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now