*ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం*
*జమ్మికుంట ఫిబ్రవరి 5 ప్రశ్న ఆయుధం*
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కేంద్ర బడ్జెట్ లో విద్య, వైద్య, వ్యవసాయ, రక్షణ, వృత్తి నైపుణ్య రంగాలకు అధిక నిధులు మంజూరు చేసిందని, ఇది నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు, వ్యాపార వర్గాలకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే విధంగా సంవత్సర ఆదాయ పన్ను 7లక్షల నుంచి 12 లక్షలకు అంటే ఓకేసారి ఐదు లక్షల రూపాయలు పెంపు దేశ చరిత్రలో ఏ ప్రధాని చేయలేని సాహసం చేసి 12 లక్షల వరకు పెంచి, ఒక పైసా కుడా పన్ను విధించకుండా, రాయితీ ఇచ్చిందని తెలిపారు.ఇది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణకి అన్యాయం జరిగిందని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర బడ్జెట్ పై అవాకులు చవాకులు మాట్లాడితే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు, ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, కోరే రవీందర్, రాజేష్ రాకూర్, మోతే స్వామి, ఇటుకల స్వరూప, రాకేష్ ఠాకూర్, కైలాసకోటి గణేష్, కొమ్ము అశోక్, బచ్చు శివకుమార్, కొండ్ల నగేష్, యాంసాని సమ్మయ్య,బల్సుకురి రాజేష్, రాచపల్లి ప్రశాంత్, గర్రేపల్లి నిరూపారాణి, ఎనమనగండ్ల రామస్వామి, ఉడుగుల రవికుమార్, ఉడుగుల మహేందర్, ముకుంద సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.