ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వేను నిర్వహించగా.. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. సర్వేలో 69 శాతం ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా.. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 63 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. 25 మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని పుమియో కిషిదా చిట్టచివరి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 39 శాతం జనామోదం లభించింది. గతంలో వెలువడిన సర్వేల్లోనూ ప్రధాని మోదీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. ఈ ఏడాది జులై 8-14 మధ్య ప్రతి దేశంలోనూ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి సర్వే సంస్థ ఈ జాబితాను విడుదల చేసింది..