*దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం*
*
*బడ్జెట్ లో రక్షణ ,విద్య ,వైద్యం వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యం*
*12 లక్షల వరకు టాక్స్ మినహాయింపు కోట్లాదిమందికి గొప్ప శుభవార్త*
*50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి*
*బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి*
*ఇల్లందకుంట ఫిబ్రవరి 4 ప్రశ్న ఆయుధం*
కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ స్థితిగతినే మారుస్తుందని, బడ్జెట్ కేటాయింపులన్నీ వికసిత్ భారత్ లక్ష్యంగానే జరిగాయని అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ చారిత్రక బడ్జెట్ ను ప్రవేశపెట్టారని బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి అన్నారు బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం రోజున బిజెపి ఇల్లందకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకo కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధానంగా రక్షణ, విద్య, వైద్యం, వ్యవసాయం , స్కిల్ డెవలప్మెంట్ లకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అందుకు తగిన విధంగా బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ తో పాటు 36 రకాల ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ పై కస్టం డ్యూటీ నుంచి మినహాయించడంతో వాటికి సంబంధించిన మందులు ఇకపై చౌకగా లభిస్తాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం, క్యాన్సర్ పేషెంట్లకు అవసరమైన మందులు చౌకగా లభించే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరపడం శుభపరిణామన్నారు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి మూడు లక్షల నుండి 5 లక్షల వరకు పెంపు, పప్పుధాన్యాల ఉత్పత్తికి సమృద్ధి పథకం, పండ్లు కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం ప్రారంభం చేయడం, పీఎం ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టడం లాంటివి రైతాంగానికి ఎంతో తోడ్పాటునిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయని 50 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చారిత్రకమైందని, బడ్జెట్ కేటాయింపులన్నీ అన్ని వర్గాలకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. ఉచితాల పేరుతో ప్రజలను మాయ చేసే వాళ్లకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు మింగుడు పడడం లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు ప్రతిపక్షాలకు కొన్ని వర్గాలకు భయం కలిగించిందని, అమెరికా డీప్ స్టేట్, చైనా,పాకిస్తాన్ సోనియా, రాహుల్,కమ్యూనిస్టులు,మావోయిస్టులు ,అర్బన్ నక్సల్స్, నేరగాళ్లు, మాఫీయా లకు దేశం అంటే ద్వేషం నింపుకున్న ప్రతి ఒక్కరిని ఈ బడ్జెట్ బడ్జెట్ భయపెట్టిందన్నారు. 12 లక్షల వరకూ ఇన్కమ్ టాక్స్ లేదని తెలిసిన కోట్లాదిమంది ప్రజలు ఆనందంలో ఉంటే , ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక దుఃఖంలో ఉన్నాయన్నారు. మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అబ్బిడి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ 2025-26 దేశ బడ్జెట్ పేద, మధ్యతరగతి మరియు రైతు సంక్షేమ అభివృద్ధి చెందేవిధంగా, సూక్ష్మ, చిన్న, మధ్యస్థ పరిశ్రమలు అభివృద్ధి చెందేవిధంగా ఉన్నదని, ఆదాయ పన్ను పరిమితి 12లక్షల వరకు పెంచడం వల్ల కోటి మధ్యతరగతి కుటుంబాలకు లబ్దిచేరుతుందని అన్నారు, తెలంగాణ రాష్ట్రం లో కనిపించే అభివృద్ధి లో అధిక నిధులు కేంద్రప్రభుత్వామువే అని, ఇప్పటికే 2500 కిలోమీటర్ల రోడ్స్ పూర్తి అయ్యాయని, ఇంకో 2500 కిలోమీటర్ల రోడ్లు, 340 కిలోమీటర్ల రిజినల్ రింగ్ రోడ్ నిర్మాణం లో ఉన్నాయని, తెలంగాణ లో 40 రైల్వే స్టేషన్ లను సుందరికరణ, కాజిపేట్ రైల్వే కోచ్ తయారీ కేంద్రం, రామగుండం ఎరువుల కంపెనీ,ఎన్ టి పి సి అదనపు విధ్యుత్ కేంద్రం, యాదగిరి పట్టణం వరకు ఎం ఎం టి ఎస్ రైల్వే లైన్, సిద్దిపేట, మెదక్ కొత్త రైల్వే లైన్లు కేంద్రం నిధులతో అభివృద్ధి చేసినవే అని అన్నారు, బీజేపీ ప్రభుత్వం భారనా చేస్తే చారానా ప్రచారం చేస్తుందని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం చారానా చేసి బారానా ప్రచారం చేసుకొంటుందని ఏద్దేవ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కొత్త శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ గుత్తికొండ రాంబాబు,కంకణాల రవీందర్ రెడ్డి, కంకణాల సురేందర్ రెడ్డి, అబ్బీడి తిరుపతి రెడ్డి, మురహరి శంకర్ , ఉప్పు దుర్గయ్య, మురహరి గోపాల్, చదువు సాయిరెడ్డి , కొక్కుల దేవేందర్,ఇంగ్లే రమేష్, తోడేటి శ్రీనివాస్ , జంగం సమ్మయ్య, తిప్పరబోయిన సమ్మయ్య,చిట్ల తిరుపతి, గురుకుంట్ల అనిల్, చందగల్ల సురేష్, మంద ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు