*ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన!*
అమరావతి:ఏప్రిల్ 17
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. రాజధాని పనుల పున రుద్ధరణ కోసం మే 2న రానున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.
తుళ్లూరు మండలం వెలగ పూడిలో ఉగాది రోజున పీ4 కార్యక్రమం జరిపిన ప్రదేశం లోనే ప్రధానమంత్రి కార్య క్రమం కూడా నిర్వహించను న్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులను సీఎం చంద్ర బాబు కోరారు. ఇప్పటికే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లను ప్రభుత్వం ఆమోదించింది. మూడేళ్లలో ఎట్టి పరిస్థితుల్లో వీటి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
మంత్రుల చాంబర్లు, సంబంధిత హెచ్‌వోడీ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మాణాలు కొనసాగాలని సూచించారు. అంసెబ్లీలో అంతర్గత వసతులు ఎలా ఉండాలన్న అంశంపై స్పీకర్‌తోపాటు మంత్రులు పి.నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, లోకేశ్ సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.