యువత డ్రగ్స్ కు బానిస కావద్దు – ప్రిన్సిపాల్ బీ రమేష్

*యువత డ్రగ్స్ కు బానిస కావద్దు – ప్రిన్సిపాల్ బీ రమేష్*

*జమ్మికుంట ఏప్రిల్ 15 ప్రశ్న ఆయుధం*

IMG 20250415 WA2217 scaled

, యువత డ్రగ్స్ బారిన పడవద్దని కళాశాల ప్రిన్సిపాల్ డా. బీ రమేష్ అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం కళాశాల యాంటి డ్రగ్స్ కమిటి ఆధ్వర్యములో ప్రిన్సిపాల్ రమేష్ అధ్యక్షతన యాంటి డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కు బానిసై జీవితాలను నాశనం చేసుకొవద్దన్నారు అనంతరం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ , మహాత్మ జ్యోతిభా పూలే మహానీయుల జయంతిని పురస్కరించుకోని ఇటీవల నిర్వహించిన రంగోళి, వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఓదేలు కుమార్, యాంటి డ్రగ్స్ కమిటీ కో-ఆర్డీనేటర్ సీ. రాజ్ కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రవి. రవీందర్, అధ్యాపకులు గణేష్, మాధవి, శ్యామల, రాజేంద్రం, కిరణ్ కుమార్, ఉమా కిరణ్ , అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment