ప్రశ్నఆయుధం న్యూస్ దమ్మపేట మండల ప్రతినిధి సెప్టెంబర్ 25
దమ్మపేట మండలం గీతాంజలి ప్రవేట్ స్కూల్ ఇంగ్లీష్
మీడియం పదవ తరగతి చదువుతున్న కోరం వీర శంకర్ సన్నాఫ్ రామోజీ గేమ్స్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్ జి ఎఫ్ వాలీబాల్ టీం లో సెలెక్ట్ అయినందుకు గీతాంజలి స్కూల్ ప్రిన్సిపాల్ మేడిది వెంకటరత్నం మాట్లాడుతూ వీరశంకర్ను అభినందించారు. అలాగే మిగతా విద్యార్థులను కూడా అభినందిస్తూ ప్రతి విద్యార్థులు ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని దానిని వెలికి తీసి ఆ రంగంలో నిష్ణాతులుగా తయారు చేయడంలో గీతాంజలి స్కూల్ ముందు ఉంటుందని.ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధార మల్లికార్జున రావు మాట్లాడుతూ వీర శంకర్ను అభినందిస్తూ విద్యార్థులకు చదువుతోపాటు అన్ని రంగాలలో కూడా నిష్ణాతులుగా చేయడంలో గీతాంజలి స్కూలు ముందుంటుందని నిరూపించారని ప్రిన్సిపల్ వెంకటరత్నం నీ అభినందించారు.అలాగే పిఈ టి నాగబాబు నీ దారా మల్లికార్జునరావు ఈ సందర్భంగా అభినందించారు. ఆటలు ఆడటం లో ఉండే ఉపయోగాలను గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.