నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ముందడుగు పడింది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మెట్ల బావుల పునరుద్ధరణకు సంబంధించి సీఐఐ, పర్యాటకశాఖ మధ్య ఒప్పందం కుదిరింది. ఓయూలోని మహాలఖా మెట్ల బావి పునరుద్ధరణకు ఇన్ఫోసిస్, సాలార్‌జంగ్, అమ్మపల్లి బావులు భారత్ బయోటెక్, అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్ధరించనున్నాయి. పురాతన మెట్ల బావులకు పూర్వ వైభవం తెచ్చే విధంగా ఆయా సంస్థలు కృషి చేయనున్నాయి.
నగరంలోని పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ముందడు..
by admin admin
Published On: September 28, 2024 1:26 pm
