మహిళల తోటే విద్యకు ప్రాధాన్యత

*మహిళల తోటే విద్యకు ప్రాధాన్యత*

*భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు, విద్య ఎంతో అవసరం*

*IMG 20250313 WA0082

సమరసత రాష్ట్ర ప్రముఖ్ అప్పల ప్రసాద్*

*జమ్మికుంట మార్చి 13 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 52 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హాజరైన సామాజిక సామరసత అప్పల ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని వారి పాత్రను విద్య వైపు మళ్లిస్తే దేశం పురోగతి చెందుతుందని అందుకే విద్య పై మహిళలు ముఖ్యపాత్ర పోషించే విధంగా ఆచార్యులు సంపర్కం చేయాలని వారిని తరగతుల వారీగా కుటుంబ సమావేశం నిర్వహించాలని అప్పుడే భారతదేశం గురు స్థానంలో ఉంటుందని , జిజియాబాయ్ శివాజీకి చిన్నతనంలోనే విద్యతో పాటు సంస్కారం నేర్పినందుకే (మరాఠా) హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడని మన పిల్లలు కూడా దేశ భవిష్యత్తు నిర్ణయించే విధంగా తల్లిదండ్రులే విద్యార్థులను ప్రోత్సహించాలని అప్పుడే భారతదేశం బాగుపడుతుందని వారన్నారు.

చిన్నారి విద్యార్థులచే చెక్కభజన, కోలాటం, యోగ్చప్, పిరమిడ్స్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మంతెన హేమలత, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, శీలం శ్రీనివాస్, ముక్కశివకుమార్ పట్టణ సీఐ వరగంటి రవి, వ్యవస్థాపక ప్రధాన ఆచార్యులు పూజారి సాంబయ్య , డాక్టర్ ముక్క రాజేశ్వరయ్య, డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, విద్యాపీఠం జిల్లా కార్యదర్శి తెల్ల రాజమౌళి , ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల రాజయ్య, సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆవాల రాజారెడ్డి ,ఆకుల రాజేందర్, ప్రబంధకారిణి కార్యదర్శి దాసరి రవీందర్, శ్రీలా జయప్రకాష్, బచ్చు శివ కుమార్ , రావికంటి నీలకంఠం , కేతపల్లి మాధవరెడ్డి, బుర్ర శివయ్య, తుమ్ల మోహన్రావు, చదువు కిరణ్, ప్రధాన ఆచార్యులు గుడికందుల సుదర్శన్ ఆచార్యుల బృందం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment