డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన 5 మందికి జైలు శిక్ష – 31 మందికి జరిమానా
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 1 నిజామాబాదు: మద్యం సేవించి వాహనాలు నడిపిన 36 మందిని పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లో పట్టుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ ఆధ్వర్యంలో వారిని కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ఎదుట హాజరుపరిచారు. విచారణలో 32 మందికి రూ.47 వేల జరిమానా విధించగా, ఐదుగురికి జైలు శిక్ష ఖరారైంది.సిద్దుల శ్రీకాంత్‌కు 2 రోజుల జైలు శిక్ష, ఎం.సాయిబాబా, షేక్ గౌస్‌లకు 3 రోజుల శిక్ష, షేక్ అమర్‌కు 4 రోజుల శిక్ష, షేక్ పురోజ్‌కు వారం రోజుల జైలు శిక్ష విధించారు.మద్యం తాగి వాహనాలు నడపడం ప్రాణాలకు ప్రమాదకరమని, భవిష్యత్తులో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు.