చంచల్‌గూడ జైలులో ఖైదీల నిరాహారదీక్ష..
చంచల్‌గూడ జైలులో రాజకీయ ఖైదీల హక్కులను జైలు అధికారులు హరించి వేస్తున్నారని, వారికి న్యాయం చేయాలని సీడీఆర్‌ఓ కన్వీనర్ ప్రొఫెసర్ గుంటి రవి డిమాండ్ చేశారు. చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ఉన్న రాజకీయ(మావోయిస్టు) ఖైదీలు అమితాబ్ బాగ్చీ, గంగాధర్‌రావు, రాజ్‌కుమార్ పట్ల జైలు అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, వారి హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు. గదుల్లో నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఇతర ఖైదీలు నిరాహార దీక్ష ప్రారంభించారని తెలిపారు.