సంగారెడ్డి/పటాన్‌చెరు, జూలై 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్‌చెరు పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాదిరి ప్రిథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, క్రీడలు విద్యార్థులలో ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ తరహా అకాడమీలు వారికి ఉత్తేజాన్ని కలిగిస్తాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ప్రపంచస్థాయి సదుపాయాలు ఏర్పడటం అభినందనీయం అని అన్నారు. భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు ఇక్కడి నుంచే రావాలని ఆశిస్తున్నానని తెలిపారు. అకాడమీ నిర్వాహకులు మాట్లాడుతూ.. బాలబాలికలకు ప్రొఫెషనల్ స్థాయిలో క్రికెట్ శిక్షణ అందించడమే తమ ప్రధాన లక్ష్యమని, దీనికోసం ప్రఖ్యాత కోచ్‌లు మరియు ఆధునిక సదుపాయాలతో ఈ అకాడమీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీస్ చైర్మన్ భీమ్ సేన్, పటాన్‌చెరు ఇన్‌స్పెక్టర్ వినాయక్ రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, మేడ్చల్ ఇన్‌స్పెక్టర్ హనుమాన్ గౌడ్, డాక్టర్ రాజ్ కుమార్, ప్రణయ్, పవన్, దుబెయి, శ్రీనివాస్, రాజు, సూర్య తదితరులు పాల్గొన్నారు.
సూర్య క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవం పాల్గొన్న మాదిరి ప్రిథ్వీరాజ్
Published On: July 6, 2025 6:38 pm
