కరాటే మార్షల్ ఆర్ట్స్ గ్రేడింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిథ్వీరాజ్
పటాన్‌చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మండలం పటేల్‌గూడ గ్రామ పరిధిలో గ్రీన్ మెడోస్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్‌లో తేజ బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో కరాటే గ్రేడింగ్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిరి ప్రిథ్వీరాజ్ గారు హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ద్వారా బాలబాలికలలో ఆత్మరక్షణ, నైపుణ్యం, ధైర్యం, క్రమశిక్షణ మరియు శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవి సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తాయి అని అన్నారు. తేజ బుడోకాన్ కరాటే అకాడమీ విద్యార్థుల్లో ఈ నైపుణ్యాలను పెంపొందించడం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రమేష్ , సురేందర్ ప్రతాప్ అనిల్ , విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు పాల్గొన్నారు.