*విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు పాఠశాలలు*
చదివేది నర్సరీ అయిన తనలో సగం బరువు పుస్తకాల మోత
సరైన సమయంలో పిల్లలను బాత్రూం వెళ్ళనివ్వకుండా చేయడం వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది.
* రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నప్పటికీ అధికారులు అటువైపుగా చూడడం లేదు. కనీసం ఆ పాఠశాలలకి అనుమతులు ఉన్నాయా లేవా అనే అంశంపై సైతం ఎవరు మాట్లాడడం లేదు. చాలా పాఠశాలల్లో చిన్నారులకు ఆటవిడుపు కోసం కనీసం గ్రౌండ్ సైతం లేకుండా ఉండే ప్రైవేట్ పాఠశాలలు పట్టణాలతో పాటు గ్రామాలలో సైతం వేళల్లో ఉన్నాయన్న సంగతి అటు అధికారులకు కూడా తెలుసు. ఎల్కేజీ యూకేజీ నర్సరీ చదివే పిల్లలకే 30 వేల నుండి 50 వేల వరకు వసూలు చేస్తూ యూనిఫామ్ మరియు పాఠశాలకు సంబంధించిన పుస్తకాలతో సహా వారి పాఠశాల ఐడిని సృష్టించి తల్లిదండ్రుల వద్ద నుండి డబ్బులను కాజేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్మల్ జిల్లాలో విరాజిల్లుతున్నాయని చెప్పవచ్చు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నారులు అనారోగ్యాల బారిన పడటం మరికొంతమంది చిన్నారులు హార్ట్ ఎటాక్ ద్వారా చనిపోయిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం ముఖ్యంగా పాఠశాలలో చదువు నేర్పించడంలో ఉన్న శ్రద్ధ పిల్లలకి కనీసం ఆటపాటలతో పాటు విశ్రాంతి తీసుకునేలాగా లేదా వారికి మూత్రశాలకు వెళ్లేందుకు సైతం చాలా పాఠశాలల్లో నిరాకరించడం మల మూత్ర విసర్జనకు చాలామంది చిన్నారులు టీచర్లకు భయపడి చెప్పకుండా ఉండడం వల్ల వారి శరీరంలో తెలియకుండానే చాలా జబ్బులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లు తయారయ్యి చిన్నారులు ఆస్పత్రుల వెంట తిరుగుతున్నారు. అలాంటి సంఘటన నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం దగ్గర ఉన్న ప్రైవేటు పాఠశాలలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అలా నిర్మల్ పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రైవేట్ పాఠశాలలు చిన్నారులకు భయభ్రాంతులకు గురి చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తూ ఫీజుల వసూళ్లు మరియు వారి పాఠశాల మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్పితే ఇంకేం కనిపించడం లేదు అనేది విద్యార్థి సంఘాల ఆరోపణ. ఇక చాలామంది తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో వేసేసి ఫీజులు కడుతూ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు కదా మన పనిలో మనం అనే విధంగా ఉండడం ముఖ్య కారణంగా ఇక్కడ కనిపిస్తోంది. పిల్లలకు కనీసం అంటే మూడు సంవత్సరాల నుండి కనీసం ఆరు సంవత్సరాల పిల్లల వరకు అయినా మలమూత్ర విసర్జనకి వెళ్లేందుకు టీచర్లను అడగాలంటే భయపడి చాలామంది పిల్లలు స్కూల్ కి వెళ్లను అంటూ మారాం చేసినప్పటికీ తల్లిదండ్రులకి అదేం పట్టనట్టు పాఠశాలకి పంపిస్తుండడం కూడా డబ్బులు కట్టి మరీ తమ పిల్లలకి జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు అనే ఆలోచన రాకపోవడం బాధాకరం. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకి ఫీజులు కట్టకపోతే ఎండలో నిలబెడుతున్నట్లు సమాచారం ఉంది. అలాంటిది పిల్లల ఫీజులపై ఉన్న శ్రద్ధ వారి ఆరోగ్య స్థితిగతుల పైన సైతం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లలుగా భావించి వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ చదువు నేర్పించినట్లయితే తప్పకుండా ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా స్కూల్ అంటే ఇష్టపడి మరి వెళ్లేవారు చాలామంది ఉంటారు. కానీ చాలా ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం ఇలా జరగకపోవడం అధికారులు సైతం ప్రభుత్వ పాఠశాలల వైపు ఎప్పుడో ఒకప్పుడు నామమాత్రపు తనిఖీలు చేస్తున్నట్లు ఉంటున్నారు తప్పితే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చిన ప్రైవేటు పాఠశాలలపై తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి. పిల్లల భవిష్యత్తు తో పాటు వారి ఆరోగ్యం సైతం సరిగా ఉండాలి అని అంటే తప్పకుండా వారికి సంబంధించిన అన్ని విషయాలను పాఠశాల సిబ్బందికి తల్లిదండ్రులు తెలియచేపాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది అలాగే పాఠశాల యాజమాన్యం సైతం ఆయాలను ఏర్పాటు చేసుకుని చిన్న పిల్లలను బడిలో ఉన్నంతసేపు ఆటపాటలతో చదువులు నేర్పిస్తూ ఇంటికి పంపే విధానాన్ని ప్రైవేటు పాఠశాలలు ఏర్పాటు చేసినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్యం బాగుండడంతో పాటు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు తప్పకుండా ఇలాంటి సూచనలు పాటిస్తే మెరుగైన ఆరోగ్యవంతమైన తమ పిల్లలను తల్లిదండ్రులు కల్లారా చూసుకోవచ్చు అని “తెలంగాణ పత్రిక” కోరుకుంటుంది.