ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టని అమలు చేయాలి 

ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టని అమలు చేయాలి

బీజేపీ నాయకుల డిమాండ్…

ప్రశ్న ఆయుధం 04 జూలై ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని ప్రతి పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని కఠినంగా అమలు చేసే బాధ్యత సంబంధిత విద్యాశాఖ అధికారులపై ఉంటుందని బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు గారిని చెప్పడం జరిగింది.శుక్రవారం బాన్సువాడ పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థలలో తప్పనిసరిగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు 25% ఉచిత విద్యను అందించాలని విద్యా కు చట్టంలో ఉందని కానీ ఏ పాఠశాల యజమానులు కూడా ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని. ప్రవేట్ పాఠశాల యజమానులు విద్యా పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొన్ని ప్రైవేటు పాఠశాలలో కనీస వసతులు లేవని. క్వాలిఫైడ్ లేని టీచర్లతో విద్యాబోధన ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పాఠ్యపుస్తకాల పేరుతో విపరీతమైన డబ్బులు వసూలు దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బిజెపి నాయకులు మండల విద్యాధికారిని కోరడం జరిగింది.లేనిచో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ బీజేపీ పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి బిజెపి జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ తృప్తి ప్రసాద్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు గజ్జల మహేష్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల రాజు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment