ముగ్గుల పోటీ, విజేతలకు బహుమతులు అందజేత!!

 

ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివంపేట మండలంలోని శభాష్ పల్లి లో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు అయ్యగారి యాదగిరి ఆధ్వర్యంలో తన సొంత ఖర్చుతో, శివంపేట్ మండల కాంగ్రెస్ నాయకుడు నవీన్ గుప్తా సహకారంతో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. శభాష్ పల్లి గ్రామ మహిళలు కుల మతాలు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అత్యధికంగా 130 మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సువాసన రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ముగ్గులను చూసి బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతిగా సుప్రజ, రెండవ బహుమతి అయ్యగారి మౌనిక, మూడవ బహుమతి షెహనాజ్ బేగం వీరికి చీరతో పాటు బహుమతి అందజేశారు. వయసుతో సంబంధం లేకుండా 65 సంవత్సరాల మహిళలు ముగ్గులు వేసి పోటీలో పాల్గొన్న లచ్చమ్మ కృష్ణమ్మకు ఇరువురికి నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇరువురికి వెయ్యి రూపాయల చొప్పున బహుమతి అందజేశారు.అలాగే ముగ్గుల పోటీలో పాల్గొన్న 130 మందికి సంక్రాంతి కానుకగా గ్రామ కమిటీ అధ్యక్షులు అయ్యగారి యాదగిరి ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి ఒక్కో చీరను ఇవ్వడం జరిగింది. అలాగే యువకులకు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి పానగారి మహేష్ అండ్ టీం, రెండవ బహుమతిసహదేవ్ అయ్యగారి వారి టీం లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మీకాంతారావు, ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్ణాకర్ రెడ్డి, దుర్గా నాయక్, వారాల గణేష్, రాజు గౌడ్, మరియు మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శభాష్ పల్లి మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now