*ఏపీలో కొనసాగుతున్న మద్యం లైసెన్స్ దరఖాస్తుల ప్రక్రియ*
అమరావతి:అక్టోబర్ 07
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్ ల దరఖాస్తుల ప్రక్రియ ఈరోజు ఉదయం నుండి కొనసాగు తుంది, అప్లికేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 396 షాపులకు గానూ ఇప్పటివరకు 8 వేల 274 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా విజయ నగరం జిల్లాలో 153 షాపులకు 855 దరఖాస్తులు వచ్చాయి. స్వల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 షాపులకు 75 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
సత్యసాయి జిల్లాలోనూ 87 షాపులకు 132 అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు..