పోతుల బోగూడ గ్రామంలో 25న తొట్టెల ఊరేగింపు…..

●ప్రముఖ సంఘ సేవకులు మాజీ తాజా జడ్పిటిసి కి ఆహ్వానము…..

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 19(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని పోతులబోగూడ గ్రామంలో ఈనెల 25వ తారీఖున జరగబోయే శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ. నల్ల పోచమ్మ. లకు బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన బజరంగ్దళ్ యువసేన ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు జరుపబడుతుంది. ఈ ఊరేగింపుకు ప్రముఖ సంఘ సేవకులు శివ్వంపేట తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా లకు ఆహ్వాన పత్రికా అందజేసి తప్పకుండా తొట్టిలో ఊరేగింపుకు రావాల్సిందిగా కోదారు. తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా తప్పకుండా తొట్టెల ఊరేగింపు వస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now