*ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు ఘన నివాళులు అర్పించిన..*
*శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.*
*ప్రశ్న ఆయుధం,ఆగష్టు 06 శేరిలింగంపల్లి,ప్రతినిధి*
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్ మహానీయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కొట్లాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోవింద్ చారీ, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, నటరాజ్ గుప్త, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, మాధవ హిల్స్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, శేఖర్, రమణ, శ్రీనివాస్, సుభాష్ రాథోడ్, కుటుంబరావు, నర్సింహా, సత్యనారాయణ, మహేష్ చారీ, అశోక్, మహేందర్ సింగ్, నవీన్, నరేందర్, సుధాకర్ చారీ, వెంకట్ రాములు, సుగుణరావు, మోహన్ రావు, కుమార్ మహిళలు కళ్యాణి, లక్ష్మి, ఫాతిమ తదితరులు పాల్గొన్నారు.