ప్రొఫెసర్ కోటపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.

*ప్రొఫెసర్ కోటపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘన నివాళులు.*

*-మారబోయిన రవి యాదవ్.*

*ప్రశ్న ఆయుధం,ఆగష్టు 06 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ కోటపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మారబోయిన రవి యాదవ్. ఈ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 106 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (మస్జిద్ బండ) ప్రాంగణంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతానికి పునాది వేసిన జయశంకర్ సార్ కృషిని స్మరించుకోవడం, ఆయన ఆదర్శాలు తెలంగాణ యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని నొక్కిచెప్పడం. రవి యాదవ్ మాట్లాడుతు “ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతం మనందరికీ ప్రేరణ. ఆయన ఆదర్శాలతో మేము తెలంగాణ యువజనుల అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేము.” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కే ఎన్ రాములు, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ ముదిరాజ్, గడ్డం శ్రీనివాస్, జమ్మయ్య, శ్రీకాంత్ యాదవ్, స్వామినాథ్, డాక్టర్ రవికుమార్, స్వామి ముదిరాజ్, నవీన్ గౌడ్, రాజు గౌడ్, మున్నా, శంకర్, శ్రీనివాస్, రామ దేవి, స్వరూప, శశికళ, ఆశ మారాజు, అనిత , గంగామని, రాజమణి, సురేష్ యాదవ్, గడ్డ మహేష్, రాకేష్ , శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment