ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా నల్లమల బిడ్డ ప్రొఫెసర్ ఖాసిం

స్వగ్రామం అంబటి పల్లిలో సంబరాలు

హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా నల్లమల ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ ఖాసిం నియమితులు కావడంతో ఆయన స్వగ్రామం అంబటిపల్లిలో శనివారం గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఓయూ కీలకపాత్ర వహించిందని అంత గొప్ప చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఆయన నియామకం తమకు గర్వంగా ఉందని ఎంఆర్పిఎస్ మండల నాయకులు, సామాజిక కార్యకర్త బంగారయ్య అన్నారు. ప్రొఫెసర్ ఖాసిం గూర్చి ఆయన తల్లిదండ్రులైన ఈరమ్మ హుస్సేన్ తో పాటు గ్రామస్తులు వివరించారు.ప్రొఫెసర్ సి. కాశీం ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా లింగాల మండలం అంబట్‌పల్లి గ్రామంలో పేద మాదిగ కుటుంబంలో ఈరమ్మ, హుస్సేన్‌ దంపతులకు 1977లో పుట్టారు పేదరికం మూలంగా చిన్నతనంలో పాఠశాలకు వెళ్లలేదు పశువులతోనే సహవాసం చేశారు పశువుల కాపరిగా ఉంటూనే గ్రామాల్లో కోలాటాలు నాటకాలు ఆడటం వంటి వాటిల్లో చురుకుగా పాల్గొన్నారు ఆనాడు గ్రామాల్లోకి వచ్చిన వయోజన విద్య అనే కార్యక్రమం ద్వారా అక్షరాలు దిద్దారు తర్వాత నేరుగా లింగాల మండలంలో నూతనంగా ఏర్పాటు అయిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి 1992 వరకు చదివారు ఆ తర్వాత మెదక్ జిల్లా హత్నూరలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌ని 1994 లో పూర్తి చేశారు గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిజాం కాలేజీలో 1995-98 చేరారు కలెక్టర్ కావాలనే కోరికతో విస్తృతాధ్యయనం ప్రారంభించారు కానీ నాటి కల్లోల పరిస్థితులు ప్రొ సి కాశీంని విద్యార్థి రాజకీయాల వైపు మరల్చాయి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక బాధ్యతగా విద్యార్థి రాజకీయాలను చేపట్టాల్సి వచ్చింది తను పుట్టి పెరిగిన ప్రాంతం ప్రభావం కావచ్చు కుటుంబ నేపథ్యం కావచ్చు.లేదా తండ్రికి ఉన్న రాజకీయాల పరిచయం కావచ్చు మొత్తానికి ప్రొ సి కాశీం విద్యార్థి ఉద్యమాల వైపుకు ఆకర్షితులయ్యారు విద్యార్థి రాజకీయాల్లో ఎటువంటి కృషి చేశాడో అంతకు మించి చదువుల్లో రాణించారు విద్యార్థి దశ నుండే వ్యాసాలు రాయడం ప్రసంగాలు ఇవ్వడం తప్పనిసరి అయ్యాయి దీని కోసం విస్తృతాధ్యయనం చేసారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం ఏ తెలుగు 2001 చేశారు తెలంగాణ సాధన లక్ష్యంగా సాగుతున్న ఉద్యమానికి అనుబంధంగా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ 1998 ని స్థాపించారు విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేశారు ఇదే క్రమంలో ప్రతిష్టాత్మక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం అనే అంశంపై పరిశోధన చేసి 2003లో ఎం ఫిల్ పట్టాను పొందారు
ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్‌ లో 2004లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చింది ఈ సారస్వత పరిషత్తులో సాయంత్రం కళాశాల నడిచేది ఆర్థిక సామాజిక పరిస్థితులు బాగాలేని విద్యార్థులు అందులో చేరేవారు అది కూడా తక్కువ సంఖ్యలో అక్కడ ఓ కాలేజి ఉంటుందని అక్కడ చదువుకోవచ్చనే సమాచారం ఎక్కడ ప్రచారంలో లేదు ఈ పరిస్థితులను గమనింపులోకి తెచ్చుకొని విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచారు క్రమంగా అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతూ విద్యార్థులకు అవసరమైన మానసిక స్థైర్యాన్ని అందించారు అక్కడ రాత్రిపూట చదువుకున్న విద్యార్థులను ఎందరినో ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దారు వారందరు ఇప్పుడు పాఠశాల ఉపాధ్యాయులుగా జూనియర్ కాలేజి లెక్చలర్స్‌గా డిగ్రీ కాలేజి లెక్చరర్స్‌గా రాజకీయ నాయకులుగా పోలీస్ ఆఫీసర్లుగా వివిధ వ్యాపార సంస్థల్లో సభ్యులుగా స్థిరపడ్డారు సారస్వత పరిషత్తు కళాశాలకు ప్రిన్సిపల్‌గా రెండేళ్లు సేవలందించారు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి 2009లో పిహెచ్డీ పట్టాను సాధించారు హైదరాబాదులోని నిజాం కళాశాలలో 2018 వరకు ఆచార్యులుగా విధులు నిర్వహించారు 2019లో ఓయూ కళాశాల పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా ఉండి అత్యుత్తమ సేవలను అందించారు 2022 ఆర్ట్స్ కళాశాలలో తెలుగు భాష విభాగానికి చైర్మన్ గా పనిచేసి తెలుగు భాషకు ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా కృషి చేశారు అతిపిన్నవయసులోనే ఖాసిం ఓయూ ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్ గా 2024 నవంబర్ నెలలో ఇటీవలనే నియమితులయ్యారు ప్రొఫెసర్ ఖాసిం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న నల్లమల ప్రాంతంలోని అచ్చంపేట నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు

Join WhatsApp

Join Now