Site icon PRASHNA AYUDHAM

ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి ని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్

IMG 20250508 WA2672

*ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి ని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్*

*బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్*

*కరీంనగర్ మే 8 ప్రశ్న ఆయుధం*

భారతదేశ చేపట్టిన సైనిక చర్య*ఆపరేషన్ సింధూర్* పై దేశాన్ని కించపరిచే విధంగా సైనికుల సాహసాని ఎగతాళి చేసే విధంగా పోస్ట్ చేసిన శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు సురేపల్లి సుజాత ని పై వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ అన్నారు సుజాత విద్య వ్యవస్థలో ఉంటూ దేశం పట్ల విద్వేషాన్ని నూరిపోస్తూ, విద్యార్థుల జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న విద్యా కమిషన్ సలహాదారు పదవి నుండి తొలగించి ఆమెను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు దేశ వాసులను మారణ హోమం సృష్టించిన పాకిస్తాన్ ఉగ్రముక్కులను అణచివేయాలని డిమాండ్ చేయవలసింది పోయి వారికి సపోర్ట్ గా మాట్లాడడం దేశాన్ని అవహేళన చేయడం కన్నతల్లిని అవహేళన చేయడమే అని పేర్కొన్నారు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే సుజాతను తన విధుల నుండి సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

Exit mobile version