శాబ్దీపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలన

శాబ్దీపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి పరిశీలన

— లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 18

 

మంగళవారం.శాబ్దీపూర్ గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పనుల ప్రగతిని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. లబ్ధిదారుడు చింతల సుమలత శ్రీనివాస్ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతి, రుణాల పొందుపరచడం, ఇప్పటి వరకు జరిగిన వ్యయం, ఇసుక సరఫరా, ఇతర నిర్మాణ సదుపాయాల లభ్యత వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రతి అర్హ కుటుంబం త్వరలోనే తమ స్వగృహంలో అడుగుపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.

లబ్ధిదారుడు సుమలత మాట్లాడుతూ రూ. 2 లక్షల రుణం పొందినట్లు, ఇంటి స్లాబ్ వేయడం పూర్తయ్యిందని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇదే సందర్భంలో కలెక్టర్ సంబంధిత అధికారులతో నిర్మాణ లక్ష్యాలు, మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య, రద్దు చేసిన ఇళ్ల వివరాలు, మార్క్‌అవుట్ అయిన ఇళ్ల సంఖ్య, ఇంకా ప్రారంభం కాని ఇళ్లపై పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాలని ఆదేశించారు.ఇందిరమ్మ పథకం అమలు పారదర్శకంగా, వేగవంతంగా జరగాలని, అలాగే ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట పీడీ హౌసింగ్ విజయ్ పాల్ రెడ్డి, ఎంపీడీఓ, ఎంఫీవో, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now