పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి..
– పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ
*సిద్దిపేట జిల్లా ప్రతినిధి, డిసెంబర్:30,ప్రశ్న ఆయుధం
పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని, జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ అన్నారు. హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా పదోన్నతులు పొందిన నలుగురిని సీపీ అభినందించారు. పదోన్నతులు పొందిన నలుగురు ఏఎస్ఐలు ఎండి అలీ, సిద్దిపేట ఎస్బి, ఏ.ముత్యం, సిద్దిపేట వన్ టౌన్, వి.మధుసూదన్, ములుగు, యన్.తిరుమల బాబు, సిద్దిపేట వన్ టౌన్ మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ కలిసి పూల మొక్కలను పుష్పగుచ్ఛాలు అందజేశారు. ప్రమోషన్ పొందిన ఏఎస్ఐలను సీపీ అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలియజేశారు, హెడ్ కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేసి ఉన్నత అధికారులకు ధన్యవాదలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.