జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, SS క్రీస్టల్ పేలస్,
జనసేనపార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు సముచిత గౌరవం ఉంటుంది
• కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది,
• రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా రాష్ట్రానికి, ప్రభుత్వానికి గౌరవం పెరుగుతోంది
• ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఎమ్మెల్సీ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొణిదల నాగబాబు జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతీ కార్యకర్తకు సముచిత స్థానం, కార్యకర్తల గౌరవమే మాకు గౌరవంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా బుదవారం శ్రీకాకుళంలోని ఎస్ ఎస్ క్రిస్టల్ ప్యాలెస్ లో జరిగిన సమీక్షా సమావేశంలో నాగబాబు నాయకులతో, కార్యకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ప్రతిఒక్క కార్యకర్తకు స్థానిక నాయకులకు వారి సమస్యలను వ్యక్తం చేసుకునేందుకు వీలుగా మాట్లాడే అవకాశం కల్పించటం ఎంతో సంతోషకరం. కార్యకర్తలు కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో చాలా సంతృప్తి ఉన్నదనే సమాచారం రాష్ట్ర నలుమూలల నుంచి అందుతోందని, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా ఆయన చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి గౌరవం పెరుగుతోందని వెల్లడించారు. కొంచెం ముందు వెనుక అయినా కష్టపడిన నాయకులకు పదవులు తప్పనిసరిగా వస్తాయని, పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు ఎలాంటి పదవులు ఆశించకుండానే పదేళ్లకు పైగా ప్రజాక్షేత్రంలో పని చేసిన విధానాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేనకు పదవులు ఎలా ఇస్తారు, ఎన్ని ఇస్తారు అనే అంశాలను పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇకపై ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ఎదుగుదల కోసం ఎక్కువ సమయం కేటాయించి పని చేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో వార్డు స్థాయి, బూత్ స్థాయి నాయకులతో, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అవుతానని, అందరితో మాట్లాడతానన్నారు. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకొని రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పని చేయాలని కోరారు. అంతకు ముందు చర్చ కార్యక్రమం ద్వారా నాగబాబు కార్యకర్తలకు, నాయకులకు మాట్లాడే అవకాశం కల్పించారు. కూటమి పరిపాలన పట్ల ప్రజల సంతృప్తికరమైన అభిప్రాయాలను గురించి, పవన్ కళ్యాణ్ తమ శాఖల్లో చేపడుతున్న అభివృద్ధి విధానం ద్వారా వస్తోన్న స్పందన గురించి, ప్రభుత్వానికి మరియు రాష్ట్రానికి మంచిపేరు తీసుకువస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను గురించి నాయకులు, కార్యకర్తలు కొణిదెల నాగబాబు కి వెల్లడించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, పాలకొండ MLA నిమ్మక జయక్రిష్ణ ,మాజీ మంత్రి, జనసేనపార్టీ PAC సభ్యులు పడాల అరుణమ్మ, జనసేనపార్టీ సీనియర్ నాయకులు, బిమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ పంచికర్ల సందీప్,జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పేడాడ రాంమోహన్, గేదెల చైతన్య, దాసరి రాజు,డాక్టర్ విశ్వక్షేన్, వేగులాడ దుర్గారావు, కణితి కిరణ్ కుమార్, బలగ ప్రవీణ్, పొగిరి సురేష్ బాబు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు ఈశ్వరరావు, దుర్యోధనరెడ్డి, రాష్ట్ర డైరెక్టర్ లు గర్బాన సత్తిబాబు, లొల్ల రాజేష్, నిమ్మల నిబ్రం, అధిక సంఖ్యలో జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా ప్రధానకార్యదర్శిలు, జిల్లా కార్యదర్శిలు, జిల్లా సంయుక్త కార్యదర్శిలు , జిల్లాలో ఉన్న మండలపార్టీ అధ్యక్షులు, జనసేన ముఖ్య నాయకులు, జిల్లా వీరమహిళలు, అధిక సంఖ్యలో నాయకులు తదితరులు పాల్గొన్నారు,