తిమ్మాపూర్లో బౌద్ధ శ్రావణ పౌర్ణమిపై ప్రవచనం..

IMG 20240819 WA0060

బౌద్ధ సంప్రదాయంలో “వర్షా వాసం” (జూలై మాసం నుంచి ప్రారంభం) అనేది చాలా ప్రాముఖ్యత చెందిన మాసం. తదనంతరం శ్రావణ (ఆగస్టు) మాసం అనేది బౌద్ధ బిక్షువులకు ఉపాసకులకు ముఖ్యమైనదని అన్నారు. తథగాత్ గౌతమ బుద్ధుడు సుత్తా పీఠికను అంటే తమ ధమ్మాన్ని శ్రమానులకు మరియు గృహస్తులకు బోధించిన సందేశ మాసంగా బుద్ధిస్తులు గుర్తిస్తారన్న విషయాన్ని భంతే ధమ్మరఖ్ఖిత ప్రవచించారు. సోమవారం ఉదయం జిల్లా నిజమాబాద్ తిమ్మాపూర్ గ్రామ శివార్లలో ఉన్న మోక్షానంద బుద్ద విహార్లో శ్రావణ మాసం యొక్క విశిష్టతలపై పాళీ భాష పండితులు భంతే ధమ్మరఖ్ఖిత గారు ప్రజలకు బోధించారు. ఇకముందు మాట్లాడుతూ ప్రతి గృహస్తుడు నిత్యజీవితంలో శాంతి సమృద్ధి ధర్మబద్ధంగా జీవించాలంటే బౌద్ధ ధమ్మని ఎలా పాటించాలి, సమాజంలో ధర్మాన్ని ఎలా ప్రచారం చేయాలనే అంశాల్ని సవిస్తరంగా ఆయన వివరించారు. అనంతరం ముంబై నుంచి విచ్చేసిన బహుజన నేత నాగ్ సేన్ మాలజీ తన తండ్రి మరణానంతరం బౌద్ధ సంప్రదాయం ప్రకారం భిక్షువులకు ఇచ్చే “చివర్ దానం” (వేసుకునే కాషాయ వస్త్రాలు) భంతేజీ కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కరైట్ నేతలైన మూగ ప్రభాకర్, జాంభవ చమార్, రాంపూర్ రత్నాకర్, మామిడి రాజేందర్, జర్నలిస్టులైన సమ్రాట్ అశోక్, అంగుళి మాలజీ పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now