రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను కాపాడుకుందాం” నినాదంతో మేడ్చల్‌లో పాదయాత్ర

*”రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను కాపాడుకుందాం” నినాదంతో మేడ్చల్‌లో పాదయాత్ర**

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ ప్రశ్నా ఆయుధం ఏప్రిల్ 15

IMG 20250415 WA2067

నియోజకవర్గంలో “భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్‌ను కాపాడుకుందాం” నినాదంతో రాజ్యాంగ రక్షణ పాదయాత్ర ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం ముప్పా రామారావు ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని ఆర్జీకే కాలనీలో జరిగింది.ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు. “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” నినాదాలతో పాదయాత్ర ఊపందుకుంది.కార్యక్రమంలో కీసర మండల్ అధ్యక్షుడు కోళ్ల కృష్ణ యాదవ్, బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు ఈగా శ్వేత, మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు శోభా రాణి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిడి విజయ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పాదయాత్రలో, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కాపాడుతూ ప్రజాస్వామ్య విలువలను నిలుపుకోవాల్సిన అవసరాన్ని నాయకులు హృదయపూర్వకంగా తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment