Site icon PRASHNA AYUDHAM

కబ్జాదారుల నుండి చెరువు శిఖం భూములను కాపాడండి.

IMG 20250502 WA01511

కబ్జాదారుల నుండి చెరువు శిఖం భూములను కాపాడండి.

ఇరిగేషన్ అధికారులకు వినతి పత్రం అందజేత

ప్రశ్న ఆయుధం 02 మే (బాన్సువాడ ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మజిపేట గ్రామ ప్రజలు రైతులు సమావేశమై, గత రెండు రోజులుగా గ్రామ పెద్ద చెరువు కట్ట శిఖం భూమిలో ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న కబ్జా పనులను గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా పెద్ద చెరువు కట్టను జెసిబి లతో టిప్పర్లతో ముంపునకు గురి చేస్తూ సాగుకు అనుకూలంగా చెరువును ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఈ శిఖం భూమిని ఖాబ్జదారులనుండి కాపాడి,అక్కడ చేపట్టే పనులను తక్షణమే పూర్తిగా ఆపించాలని ఆయకట్టు రైతులు తీర్మానం చేశారు.ఈ తీర్మానం కాపీని సబ్ కలెక్టర్,ఎమ్మార్వో, ఇరిగేషన్ ఈ.ఈ.డి.ఈ.లకు వినతి పత్రం అందజేశారు.

Exit mobile version