సామాజిక హక్కుల పరిరక్షణ సాహస లక్ష్యం

సామాజిక హక్కుల పరిరక్షనే “సాహసం ” లక్ష్యం.

సాహసం రాష్ట్ర అధ్యక్షులు డా. ముప్పారం ప్రకాశం

10 సంవత్సరాల తెలంగాణ – ప్రజల స్థితిగతులు అంశంపై గజ్వేల్ లో జిల్లా సదస్సు

గజ్వేల్ ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టి వై ఆర్ లైబ్రరీ హాలులో సామజిక హక్కుల సంఘం (సాహసం) ఆధ్వర్యంలో 10 సంవత్సారాల తెలంగాణ – ప్రజల స్థితగతులు అని అంశంపై జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా సాహసం రాష్ట్ర అధ్యక్షులు డా॥ ముపారం ప్రకాశం హాజరై మాట్లాడుతూ.” ఈ దేశంలో రాజ్యంగా బద్దంగా ప్రజలకు అందాల్సిన హక్కులు అందట్లేదని పాలక వర్గాలు ప్రజల హక్కులు అమలుపరచాల్సింది. మర్చిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలియజేసారు . ప్రపంచంలో సమాజానికి కావాల్సిన హక్కుల కోసం విద్యార్థి, యువతే ముందు ఉండి సాధించిందని భారతదేశ స్వాతంత్ర్య పోరాటం లోను కీలకపాత్ర పోషించిందని తెలిపారు. మన తెలంగాణ లో నీళ్లు,నిధులు, నియామకాల మనకే చెందాలని విద్యార్థి, యువత ముందుండి వీరోచిత పోరాటం నిర్వహించిందని ఆ పోరాటానికి ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదని మరి అలా ప్రాణత్యాగంపై తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల హక్కులు కాలరాసారని నేడు మన హక్కుల అమలు కోసం మరింత పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు. సమాజంలో ఏ వర్గాలకు హక్కులు అందకుండా నిర్లక్ష్యం చేస్తారో అక్కడ వారి హక్కుల అమలు కోసం పోరాటానికి సామజిక హక్కుల సంఘం(సాహసం) ఉంటుంది అని సాహాసన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉందని అది తన సామాజిక బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తలకొక్కుల రాజు సాహసం నాయకులు రమణకర్ మల్లేష్ యాదవ్ సోలమన్ ప్రవీణ్ పిల్లే కిరణ్ కుమార్ దయాకర్ మహేష్ యాదవ్ రమేష్ యాదవ్ మల్లికార్జున్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now