రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాద్యత

రాజ్యాంగ పరిరక్షణ మన అందరి బాద్యత.

రాజ్యాంగానుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి.

జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి.

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ 

ఉదయ్ కుమార్ రెడ్డి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, దళిత హక్కులకు మార్గదర్శకుడు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌ గారి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటామని ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవం గా కూడా జరుపుకుంటారని,1949 నవంబర్ 26న భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించారని. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని. అలాగే భారత రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 127 వ జయంతిని పురస్కరించుకొని 2015 నవంబర్ 19న… కేంద్ర ప్రభుత్వం నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని రాజ్యాంగ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షుడిగా వ్యవహరించి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మహేందర్ ఏ.ఓ శ్రీమతి మణి ,సాయుధ దళ డిఎస్పీ రంగ నాయక్, యెస్.బి సి.ఐ సందీప్ రెడ్డి ,డీసీఆర్బీ సి.ఐ మధు సూదన్ గౌడ్ ,ఆర్. ఐ శైలేందర్, ఆర్.ఎస్.ఐ లు మహిపాల్ ,భవానీ కుమార్ జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment