Site icon PRASHNA AYUDHAM

పని ప్రదేశంలో మహిళా కార్మిక ఉద్యోగులకు రక్షణ కల్పించాలి ఐఎఫ్టియు

రక్షణ
Headlines in Telugu:

పని ప్రదేశంలో మహిళా కార్మికులకు ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని కలకత్తా ట్రైనీ డాక్టర్ అభయ కేసు సిబిఐ విచారణ చేసి సుప్రీంకోర్టుకు అప్పజెప్పి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూభారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కొత్తగూడెంలో షాపింగ్ కాంప్లెక్స్ వర్కర్స్ మరియు హాస్టల్ వర్కర్స్ తో కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

జిల్లా కోశాధికారి మోత్కూరు మల్లికార్జున రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ పని ప్రాంతాలలో పనిచేస్తున్న మహిళలకు రక్షణ లేదని ఎన్ని చట్టాలు ఉన్నా ఉపయోగం లేకుండా పోతుందని వారు అన్నారు. దేశ అభివృద్ధిలో మహిళలే ప్రధాన పాత్రను ఆ మహిళలని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని వారు అభయ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని వారి డిమాండ్ చేశారు.ఐఎఫ్ టీ యు నాయకులు వెంకటమ్మ,వినోద్ మరియు కార్మికులు పాల్గొన్నారు.

Exit mobile version